Acharya shooting resumes

Acharya: మెగాస్టార్ చిరంజీవి ఆచార్య షూటింగ్ తిరిగి ప్రారంభం..రామ్ చరణ్ కూడా షూటింగ్ లో..

cinema Entertainment News

Acharya:  మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ఆచార్య. కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఈ సినిమాని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమాను మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఒక కీలకపాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలావరకూ పూర్తి అయిపొయింది. నిజానికి ఈ ఆగస్టులో సినిమా విడుదల కావలసి ఉంది. కానీ, కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్యాలెన్స్ షూటింగ్ ఉండిపోవడంతో అప్పుడు రిలీజ్ కావడం కష్టం లానే కనిపించింది. అయితే, ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గడంతో ఆచార్య సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభిస్తున్నారు. షూటింగ్ ఈరోజు ప్రారంభం అయినట్టు తెలుస్తోంది.
ఈ విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ షూటింగ్ లో చిరంజీవి, కాజల్ తో పాటు రామ్ చరణ్ కూడా పాల్గొంటున్నారట. వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందని తెలుస్తోంది. ఈ వారం అంతా ఈ సినిమా షూట్ లో రామ్ చరణ్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

Acharya షూట్ లో రామ్ చరణ్ భారీ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు పలు కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు కొరటాల. అదేవిధంగా పూజాహేగ్దే కూడా ఈ షూటింగ్ లో జాయిన్ అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read: Two Private Parts: వైద్యులనే ఆశ్చర్యపరచిన ఘటన..రెండేసి ప్రయివేట్ పార్ట్ లతో వివాహిత మహిళ!

Dilip Kumar: బాలీవుడ్ మెగాస్టార్ దిలీప్ కుమార్ కన్నుమూత! విషాదంలో భారతీయ సినీ పరిశ్రమ

 

Leave a Reply

Your email address will not be published.